హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. సో మవారం రాష్ట్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆయిల్‌పామ్ విత్తనాల సరఫరాదారుల ఎంప్యానల్మెంట్ని ఏర్పా టు చేయాలని, ఆయిల్‌పామ్ రైతులకు కనిష్ఠ మద్దతు ధర రూ.25వేలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీకి రూ.100 కోట్లు మంజూరు చేయాలన్నారు.
వ్యవసాయానికి ఉపాధిహామీ పథకా న్ని అనుసంధానం చేయాలని, మైనర్ ఇరిగేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌ను కోరారు. సోమవారం రాష్ట్ర పర్యటనలో ఉన్న శివరాజ్‌సింగ్ చౌహన్తో కోదండరెడ్డి సమావేశమయ్యారు.