హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యాసంగికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. ఏమాత్రం కొరత లేదని, ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు యూరియా నిల్వలపై సోమవారం కలెక్టర్ల తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించి మాట్లాడారు.
యాసంగికి కేంద్ర ప్రభు త్వం మొత్తం 10.40 లక్షల టన్నులు కేటాయించగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60లక్షల మెట్రిక్ ట న్నులకు 5.44 లక్షల టన్నులు వచ్చినట్టు చెప్పారు. ఇక యూరియా యాప్ ద్వారా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో డిసెంబర్ 20 నుంచి ఇప్పటివరకు బుక్ చేసిన 82,059 మంది రైతులు 2,01,789 బ స్తాలు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రై తులు పత్తిని సులభంగా అమ్ముకుంటున్నట్టు చెప్పారు. టోల్‌ఫ్రీ 1800599 5779ను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.