Minister Thummala | వేగంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్న మంత్రి తుమ్మల.. మట్టి దొరకడం లేదన్న ఇంజినీర్
Minister Thummala | భద్రాచలం పట్టణం(Bhadrachalam)లో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి(Second bridge) పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి వారధి పనులను పరిశీలించారు.
ఖమ్మం, డిసెంబర్ 17(ఖమ్మం నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రాచలం పట్టణం(Bhadrachalam)లో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి(Second bridge) పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి వారధి పనులను పరిశీలించారు. వారధి నిర్మాణానికి 2015లో నాడు తాను మంత్రి హోదాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు.
పనుల్లో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వారం రోజుల్లో పనులను ప్రారంభించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనులను ప్రారంభించాలన్నారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మట్టి దొరకడం లేదని సైట్ ఇంజినీర్ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, ఏజెన్సీలు సమగ్ర నివేదికలతో త్వరలో కలెక్టరేట్లో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. పర్యటనలో ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న, అదనపు కలెక్టర్ రాంబాబు, ఎన్‌హెచ్ ఈఈ యుగంధర్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఆర్డీవో మంగీలాల్ తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

