మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతను మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర వైభవంగా జరుగుతుందన్నారు. ఏడుపాయల దుర్గామాత దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏడుపాయలకు అనేక నిధులు కేటాయించారు. గత ప్రభుత్వాలు ఏడుపాయలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. భక్తులకు సకల సదుపాయాలు ఉండాలి. సీఎం కేసీఆర్ అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏడాదికేడాది ఏడుపాయల అభివృద్ధి చెందుతుందన్నారు.