తెలంగాణ గోపాలమిత్రలకు శుభవార్త చెప్పిన మంత్రి తలసాని
Minister Talasani Srinivas Yadav
హైదరాబాద్ : రాష్ట్రంలోని గోపాలమిత్రలకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దసరాకు ముందే శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉండి.. తదితర కార్యక్రమాల్లో సేవలందిస్తున్న గోపాలమిత్రలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న పారితోషికానికి అదనంగా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం పెంచి, అదే రీతిలో గోపాలమిత్రలకు కూడా అందజేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములవుతూ, గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు అందుబాటులో ఉంటూ పాడి గేదెలకు కృత్రిమ గర్బాధారణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, నట్టల నివారణ మందుల పంపిణీ వంటి తదితర కార్యక్రమాలలో గోపాలమిత్రులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
గోపాలమిత్రలకు ప్రస్తుతం రూ. 8,500 చెల్లిస్తుండగా, పెరిగిన 30 శాతంతో రూ. 2,550 కలుపుకొని మొత్తం రూ. 11,050 లకు పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 1530 మంది గోపాలమిత్రలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు గోపాలమిత్రలకు రూ. 3,500ల పారితోషికాన్ని అందించే వారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోపాలమిత్రలు అందిస్తున్న సేవలను కేసీఆర్ గుర్తించి, ఒకేసారి రూ. 8,500లకు పెంచడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో గోపాలమిత్రలకు పారితోషికాన్ని ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే చేయాలి, నాణ్యమైన పాడి సంపదను పెంచాలనే ఉద్దేశంతో కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని వివరించారు. 2019 నుండి జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద 14 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమంలో కూడా గోపాలమిత్రలు పాడి రైతులతో నేరుగా సంప్రదించి చేసిన కృషి ఫలితంగా పాల సేకరణ పెరిగిందని తెలిపారు. గోపాలమిత్రల నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించే విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి తెలంగాణా వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన నిపుణుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజులలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అనేక కార్యక్రమాలలో గోపాలమిత్రల సేవలను మరింతగా ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

