Minister Talasani | విశ్వవ్యాప్తంగా బోనాల పండుగ..తెలంగాణకు గర్వకారణం : మంత్రి తలసాని
Minister Talasani | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను నేడు అనేక దేశాల్లో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల సందర్భంగా సోమవారం నగరంలో గల 358 దేవాలయాలకు మంజూరైన 2.13 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను ఆయా దేవాలయాల కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు.
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను నేడు అనేక దేశాల్లో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల సందర్భంగా సోమవారం నగరంలో గల 358 దేవాలయాలకు మంజూరైన 2.13 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను ఆయా దేవాలయాల కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను ప్రజలు గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహిస్తూ వస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉత్సవాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఇందుకోసం ఈ సంవత్సరం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయగా, బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. బోనాల సందర్బంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో బోనాలను ఘనంగా జరుపుకోవాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రాజ్, మాజీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, రాకేశ్ తివారి, కైలాష్, ఆనందరావు, మధు యాదవ్, మధు గౌడ్ , మాజీ కార్పొరేటర్లు ప్రకాష్, మిత్రక్రిష్ణ, లక్ష్మినారాయణ, జీవన్ సింగ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
for the festival
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

