హైదరాబాద్ : నిత్యావసర ధరలను పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Minister Talasani ) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పిలుపు మేరకు గురువారంసికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కట్టెల పొయ్యి పై వంట చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలు(Gas sylender} తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు. బీజేపీ(BJP) నేతలను అడ్డుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. 8 సంవత్సరాల లో రూ. 745 గ్యాస్ ధర పెంచిన మోదీ ( Narendra Modi )ప్రభుత్వం సబ్సిడీని భారీగా తగ్గించి గ్యాస్ ధరలను పెంచారని ఆరోపించారు.పెరిగిన గ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువుల పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో శుక్రవారం ధర్నాలు, నిరసనలు కొనసాగుతాయని వివరించారు.
నగరంలోని మీర్‌పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha), తదితరులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వంట గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యుడు కోలుకోలేని పరిస్థితిని కేంద్రం తీసుకువచ్చిందని ఆరోపించారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మ చౌరస్తాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజా ఆధ్వర్యంలో వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుదలకు నిరసనగా ధర్నా నిర్వహించారు.