నయీంనగర్, నవంబర్ 6 : ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా పీజీ, డిగ్రీ, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌తోపాటు వివిధ విద్యాసంస్థల నిరవధిక బంద్‌తో 18 లక్షల మంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారని, అయినా ప్రభుత్వంలో చలనంలేదని, ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. గురువారం వారు హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండాసురేఖ ఇంటిని ముట్టడించారు.
దీంతో ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకునే క్రమంలో అక్కడ తోపులాట జరగ్గా స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.