మహబూబ్ నగర్ : కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు రానే వచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి పాలమూరు -రంగారెడ్ది ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు.
డప్పు కొడుతూ సంబురాలు జరుపుకుంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పోరాడి అనుమతులు సాధించడం చారిత్రక విజయమన్నారు. పాలమూరు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరే రోజులు రావడంతో సంబురాలు చేసుకున్నారు. పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండవ దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందన్నారు.
మ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డితో మంత్రి శ్రీనివాస్ గౌడ్