నేరేడ్మెట్ ( హైదరాబాద్ ) : రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కత్తి పట్టిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న(Sarvai Papanna) అని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud ) అన్నారు. శుక్రవారం ఓల్డ్ అల్వాల్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద బహుజన వీరుడు సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాపన్న సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొగల్ సామ్రాజ్యాన్ని( Mughal Empire) గడగడలాడించారని తెలిపారు.
గోల్కొండ ఖిల్లాపై బహుజన జెండా ఎగురవేసి బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, నాయకులు స్వామి గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, సబితా అనిల్ కిషోర్, నేమూరి సాయిరాం గౌడ్, అల్వాల్ గౌడ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.