హన్వాడ, నవంబర్ 8 : కాంగ్రెస్(Congress) నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మనం చేసిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని కార్యకర్తలకు వివరించారు.
ప్రజలు మోసపోకుండా ఆలోచించి ఓటు వేయలన్నారు. పని చేసేవారికి పట్టం కట్టాలన్నారు. 22 రోజులు తన కోసం పనిచేస్తే.. 24 గంటలు మీకు రుణపడి పని చేస్తానని పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు నెలకు రూ.3వేలు అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
అనంతరం టంకర గ్రామంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీలు విజయనిర్మల, రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.