మహబూబ్‌నగర్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లో మొబైల్ ఐసీయూ బస్సులను శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సులను లార్డ్ చర్చ్, వీర స్మార్ట్ హెల్త్ కేర్ నిర్వాహకులు అంబులెన్స్‌లను సమకూర్చారు. జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి వద్ద జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో లార్డ్ చర్చి ప్రతినిధులు, వీర స్మార్ట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్స్, డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండనున్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూ. 11 లక్షల 16 వేల చెక్కులను మంత్రి అందజేశారు. మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని భగీరథ కాలనీలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వీరన్నపేటలో హెచ్.ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి కోసం రూ. 13 లక్షలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. టి.డి గుట్ట చౌరస్తా వద్ద రూ.17.50లక్షలతో చేపట్టనున్న సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Inaugurated Mobile ICU buses donated by Lord’s Church & Vera Smart Healthcare near MBC Church in Mahabubnagar. These vehicles has facilities such as oxygen supported beds, a dedicated monitoring system, CCTV & video for live interaction & capturing, duty doctors & nursing staff. pic.twitter.com/uYSu27Ianv
— V Srinivas Goud (@VSrinivasGoud) June 11, 2021