Malreddy Rangareddy | తుర్కయంజాల్, జూన్ 9 : మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గడిచిన పది సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ కార్యకర్తలు, పార్టీని కాపాడిన నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని ఆయన ఆవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఇతర పార్టీ పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి మాట్లాడారని అన్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరుత్సహనికి గురి కాకుడదని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.