నిర్మల్ : మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నిర్మల్ జిల్లాలో(Nirmal) పర్యటించారు. జిల్లా కేంద్రం గుండా ప్రవహిస్తున్న స్వర్ణ వాగు(Swarna Vagu) ఉప్పొంగిన ప్రతిసారి పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ ముంపు నకు గురవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రావు తదితరులు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దృష్టి కి తీసుకువచ్చారు.
దీంతో స్పందించిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం జీఎన్ ఆర్ కాలనీని సందర్శించారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీవాసులకు ఆయన హామీ ఇచ్చారు.