హైదరాబాద్ డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలుగు సినీపరిశ్రమ ఏపీకి తరలిపోతుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిత్రపరిశ్రమ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని, టాలీవుడ్ ఏపీకి వస్తే స్వాగతమని వ్యాఖ్యానించారు. ఏపీలో సినిమాల చిత్రీకరణకు చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. అటు.. టీడీపీ ఏపీ నేతల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సినీపరిశ్రమను ఏపీకి రమ్మని పవన్ కల్యాణ్ కోరడంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. పరిశ్రమ ఎక్కడికీ పోదని, హైదరాబాద్‌లోనే ఉంటుందని తెలిపారు.