వ్యవసాయ యూనివర్సిటీ , జూలై 11: వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి రెండుసార్లు పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన అగ్రి సపోర్ట్ సర్వీసెస్ (మాస్), జాగో కిసాన్ జాగో (ఏసీఎఫ్ఐ) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రైతులను మోసగించేవారిని సహించేది లేదని హెచ్చరించారు.
అనంతరం ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు 10 ఈ-మొబైల్ వ్యాన్లను ప్రారంభించారు. అత్యాధునిక ఆడియో విజువల్ టెక్నాలజీతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు ఏసీఎఫ్ఐ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు, రిజిస్ట్రార్ వెంకటరమణ, వర్సిటీ సంచాలకుడు రఘురామిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఏసీఎఫ్ఐ కార్యదర్శి డాక్టర్ కల్యాణి గోస్వామి తదితరులు పాల్గొన్నారు.