కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆదివాసీ, గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ జంగుబాయి(Jangubai ) అమ్మవారిని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క),(Minister Seethakka) దర్శించుకున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో రివ్యూ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి తన పర్యటనలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లా కెరిమెరి మండలంలోని దేవస్థానానికి చేరుకున్నారు.
మ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధి పై చర్చించారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవ్ రావు, అదనపు కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, ఆదివాసి పటేళ్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.