హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. వారంపాటు స్పెషల్ డ్రెవ్ చేపట్టి పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు.
మంగళవారం సెక్రటేరియట్లో సీతక్క అధ్యక్షతన వాల్టా అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాల పరిరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. దీనికి ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.