హైదరాబాద్, నవంబర్ 3 (నమ స్తే తెలంగాణ): హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం కోసమే ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం ములుగులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదపిల్లలకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం హాస్టళ్లలో కనీస వసతులు కల్పిస్తున్నదని చెప్పారు. ఆమె వెంట కలెక్టర్ దివాకర ఉన్నారు.