హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, లేకపోతే ఊద్యోగాలు ఊడతాయ్ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్, ఉన్నతాధికారుల తీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత నిర్ణయాలతో ప్రజాధనం వృథా చేస్తున్న కార్పొరేషన్ ఎండీపై మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం లో తెలంగాణ ఫుడ్స్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతి లో పనులు కే టాయించటం పై అసహనం వ్యక్తంచేశారు. అధికారులం తా పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేశారు. నాసి రకం సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులివ్వాలని మంత్రి సీతక ఆదేశాలు జారీ చేశారు. బాలామృ తం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని పేర్కొన్నారు. భువనగిరిలో బాలామృతం దారి మళ్లింపుపై విచారణకు ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ నిర్మల కాంతి వెస్లీ, తెలంగాణ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, అధికారులు పాల్గొన్నారు.