Anganwadi | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను గుర్తించి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇటీవల జారీచేసిన జీవోలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. కొన్ని యూనియన్లు ఉద్దేశపూర్వకంగా ఉసిగొల్పడం వల్లే అంగన్వాడీలు సమ్మెబాట పట్టారని, వాస్తవాలను గ్రహించి వెంటనే సమ్మె విరమించాలని విజ్ఞప్తిచేశారు.
అంగన్వాడీ సంఘాలు చేస్తున్న సమ్మెపై బుధవారం మంత్రి అధికారులతో చర్చించారు. దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకొని అంగన్వాడీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అం గన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూలేని విధంగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. అంగన్వాడీల సమ్మెతో సమాజంలో ఎకువగా ఉన్న బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సమ్మెతో సమస్యలు పరిషారం కావని, సంప్రదింపులు, చర్చల ద్వారా, వినతిపత్రాల ద్వారా పరిషరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే పలు అంగన్వాడీ యూనియన్లు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు చేసిన పనులను మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు.
☞ చరిత్రలో ఎన్నడూలేని విధంగా విజ్ఞప్తులు లేకుండానే సీఎం కేసీఆర్ మూడుసార్లు వేతనాలు పెంచింది నిజం కాదా? మెయిన్ అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,800 చెల్లిస్తున్నది నిజం కాదా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా చెల్లిస్తున్నదా?
☞ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల జీవితబీమా, 50 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వరకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే జీవో ఇటీవల ఇచ్చింది నిజం కాదా? దురదృష్టవశాత్తు మరణిస్తే టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకు రూ.10 వేలు చెల్లించే జీవోను విడుదల చేసిన ప్రభుత్వం గతంలో ఏదైనా ఉన్నదా?
☞ అంగన్వాడీ కేంద్రాల అద్దెను గ్రామీణ ప్రాం తాల్లో రూ.1000 నుంచి రూ. 2000 పెం చింది. పట్టణాల్లో రూ. 4,000 నుంచి రూ.6 వేలకు, మెట్రోపాలిటన్ సిటీలో రూ.6 వేల నుంచి 8 వేలకు పెంచింది నిజమా? కాదా?
☞ బీజేపీ అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేది. మోదీ సర్కార్ ఆ వాటాను 60-40 శాతానికి మార్చినా.. అదీ సరిగా అమలుచేయటం లేని విషయం అంగన్వాడీలకు తెలియదా?
☞ రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాలి. కానీ, అంగన్వా డీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, సహాయకుల వేతనాల్లో 17 శాతం మాత్రమే కేంద్రం చెల్లిస్తున్నా రాష్ట్రప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తున్నదని అంగన్వాడీలు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది నిజం కాదా?
☞ 2014లో అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో రా ష్ట్రం ప్రభుత్వం వాటా రూ.1500 ఉంటే, అది ప్రస్తుతం 10,950 ఉన్నదనే విషయం అంగన్వాడీలకు తెలియదని అనుకోవాలా?
☞ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీని అంగన్వాడీలకు వర్తింపజేసిన మానవీయ ప్రభుత్వం కేసీఆర్‌ది కాదా?
☞ దేశంలో ఎక్కడాలేనివిధంగా అంగన్వాడీలకు చెల్లించే గౌరవ వేతనాలు ప్రతినెల 14న మీ ఖాతాల్లో పడుతున్న మాట వాస్తవం కాదా? ఇలా ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నదా?
☞ ఉద్యోగం విరమణ వయస్సు 65 సంవత్సరాలు చేస్తూ అంగన్వాడీ టీచర్స్‌కు రూ.1 లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇవ్వాలనే మానవీయ నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ సర్కార్ ఒక్కటే అన్నది నిజం కాదా? దేశంలో ఇలా ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా?
☞ రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అదనంగా రూ.56 కోట్ల భారం పడినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న విషయం వాస్తవం కాదా?