హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ కార్యాలయంలోని శిశువిహార్లో సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్ తన మనుమరాలు ఆద్య బర్త్డే వేడుకలు నిర్వహించారు. శిశువిహార్ చిన్నారి పియానో వాయించి, ఆద్యకు బర్త్డే విషెస్ చెప్పింది.
చిన్నారులతో మంత్రి కుటుంబ సభ్యులు గడిపి, అక్కడే నేలపై కూర్చుని సభపంక్తి భోజనాలు చేశారు. చిన్నారులకు మంత్రి గోరుముద్దలు తినిపించారు. శిశువిహార్ను సందర్శించిన మంత్రి, చిన్నారులకు అందుతున్న పౌష్ఠికాహరం, ఆరోగ్యం తదితర విషయాలపై ఆరా తీశారు.