మహబూబాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిన కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్తో దీక్షిత(16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. కాగా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పరామర్శించారు. దీక్షిత చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం, అమ్మాయి తల్లి అంగన్వాడీ టీచర్ కావడంతో ప్రత్యేకంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయల సాయం అందించారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ కొమురయ్య, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.