Vishwambara | ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్ రెడీ … ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్‌కు సన్నాహాలు
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.తాజా సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ నిర్మాణ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేయడమే కాకుండా, అదే సమయంలో కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా శ్రీరామనవమి సందర్భంగా ఈ అప్డేట్ ఇవ్వాలని భావించినప్పటికీ, అదే సమయంలో ఇతర భారీ చిత్రాల అప్డేట్లు ఉండటంతో చిత్ర యూనిట్ తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, రాబోయే ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఈ అంచనాలు మరింత రెట్టింపు అవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉండే ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో చిరంజీవి మరోసారి కొత్త లుక్, పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కాగా ‘విశ్వంభర’ నుంచి రాబోయే ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ ప్రకటనపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ నుంచి ఈ డబుల్ ట్రీట్ ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- Postpone
- update
- updates
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

