Hyderabad | మియాపూర్‌లో(Miyapur) విషాదం చోటు చేసుకుంది. ఇనుప గేటు(Iron gate) మీదపడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మియాపూర్‌లోని నాగార్జున ఎన్‌క్లేవ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరేంద్ర శర్మ మియాపూర్‌లో ఫాబ్రికేషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరేంద్ర శర్మను చూసేందుకు రెండు రోజు క్రితం అతడి భార్య, పిల్లలు యూపీ నుంచి వచ్చారు. ఈ క్రమంలో ఇంటిముందు ఆడుకుంటున్న రియాన్స్ శర్మ(2)పై ఒక్కసారిగా ఇనుప గేటు ఊడి పడటంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు కండ్లముందే ఆడుకుంటున్న తమ కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.