హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్కే భవన్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు భూములు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి మొదటివారంలో పోడు భూమి పట్టాలు అందజేస్తామన్నారు. పోడు భూముల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ పట్టాలివ్వాలన్నది సీఎం అభిలాష అన్నారు. పట్టాలివ్వడం నాయకులను భాగస్వాములను చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టాల పంపిణీలో అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.