హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స మాజం తలెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవనాలు చరిత్రాత్మకమన్నారు. ఈ నెల 17న ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై శనివారం గిరిజన, బంజారా, ఆదివాసీ సంఘాల నాయకులు, ట్రైకార్, జీసీసీ చైర్మన్లు, విద్యార్థి, ఉద్యోగ సం ఘాల నేతలతో మంత్రి సమావేశమయ్యారు.
17న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని బహిరంగ సభను విజయవంతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ట్రైకార్ చైర్మ న్ రామచంద్రనాయక్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప్సింగ్, మాజీ ఐపీఎస్ డీటీనాయక్, మాజీ డీఐజీ జగన్నాథరావు, ఐఏఎస్ భారతి లఘుపతినాయక్, ఆర్టీసీ మాజీ అధికారి పాండురంగనాయక్ తదితరులు పాల్గొన్నారు.