Minister Sabitha Indra Reddy | చదివే పిల్లలంటే తనకెంత ప్రేమో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాటిచెప్పారు. మహేశ్వరం మండలం గొల్లురు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తుండగా.. కాలినడకన బడి నుంచి ఇంటికెళ్తున్న ఇద్దరు చిన్నారులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి సబిత.. ఆ చిన్నారులతో మాట్లాడి కారులో వస్తారా? అని అడిగారు. కారు చూసి సరదా పడ్డ ఆ పిల్లలు సరే అనడంత వారిని తన కారులోనే ఎక్కించుకొని, చాక్లెట్లు ఇచ్చి వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు. గొల్లురు నుంచి తండా వరకు ప్రయాణిస్తూ.. ఆ చిన్నారులతో కబుర్లు చెప్పారు. చక్కగా చదిదుకోవాలని, భవిష్యత్‌లో మంచి స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లున్న పిల్లలను తల్లిలా ఆదరించిన మంత్రిని పలువురు అభినందించారు.