Minister Sabitha Indra Reddy | దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha Indra Reddy | విద్యార్థులు తమ భవిష్యత్ ఆశయాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Minister Sabitha Indra Reddy | విద్యార్థులు తమ భవిష్యత్ ఆశయాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు.
సోమవారం సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, భాష, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

