హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాని ఉస్మానియా డాక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో జరిగిన సమయంలో వాహనంలో 20 మంది ఉన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత విద్యార్థులందరూ మోడల్ స్కూల్కు చెందినవారు.