హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదవలేదని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తిచెందిన నేపథ్యంలో వ్యాధి నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు.
కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో తెలిపారు.