హైదరాబాద్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.
అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని ఆయన నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలవ్వాలని సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని మంత్రి పువ్వాడ తెలిపారు.