రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం బోయి నపల్లి మండల కేంద్రంలో (Boinapally) శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి( Shivaji statue) మాట్లాడారు. రానున్న రోజుల్లో డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
గాంధీజీ, ఛత్రపతి శివాజీల ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆరు వేల బస్సులు కేటాయించామని పేర్కొన్నారు. అందుకే గ్రామాల్లో ఈ నెల 25 వరకు బస్సుల కొరత ఉంటుందని తెలిపారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి నేటికీ కనిపిస్తుందని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.