సుల్తాన్‌బజార్, జూన్ 8: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం బత్తిని సోదరుల చేపమందు ప్రసాదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్, నాయకుడు మధుయాష్కీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. మృగశిర కార్తె రోజు చేపప్రసాదం తీసుకోవడం వల్ల అస్తమా తగ్గుతుందని చాలామంది నమ్ముతుంటారని తెలిపారు.
రాత్రి 7గంటల వరకు 47వేల చేప పిల్లల విక్రయాలు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. చేప ప్రసాదం పంపిణీలో మెదక్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ (75) చేపమందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చి క్యూలో నిల్చున్నాడు. ఆ సమయంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. వైద్య సిబ్బంది సీపీఆర్ చేయగా, అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.