TS Budget | సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణను పునర్నిర్మించే విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉందని రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆదాయ, వ్యయాలను ఆకలింపు చేసుకుంటూ ప్రజలకు ఏది అవసరమో దాన్ని గుర్తించి బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ను కేటాయించిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలమున్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందించడానికి బడ్జెట్లో రూ.7,740 కోట్ల ప్రతిపాదించడం సంతోషకరమన్నారు.