Pedavagu project | అధికారుల నిర్లక్ష్యం వల్లే పెదవాగు ప్రాజెక్టుకు గండి : మంత్రి పొంగులేటి
Pedavagu project | అధికారుల నిర్లక్ష్యంతోనే పెదవాగు ప్రాజెక్టుకు( Pedavagu project) గండిపడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti )అన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడ వల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు ఇటీవల గండి పడిన విషయం విదితమే.
హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతోనే పెదవాగు ప్రాజెక్టుకు( Pedavagu project) గండిపడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti )అన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడ వల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు ఇటీవల గండి పడిన విషయం విదితమే. ఈ మేరకు సోమవారం మంత్రి గండి పడిన ప్రదేశాన్ని పొలాల్లో వేసిన ఇసుక మేటలను, వరిపంట కొట్టుకుపోయిన పొలాలను, వరద వల్ల మునిగిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు.
సరైన సమయానికి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, రైతులు బాధ తీర్చలేనిదని అన్నారు. రైతులకు తీవ్రనష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు పత్తి, వరి పోయిన వారికి విత్తనాలు ఉచితంగా అందజేస్తామన్నారు. కొట్టుకుపోయిన గెర్రెలకు రూ. 3వేలు ప్రభుత్వం అందజేస్తుందని, ఆవులు, బర్రెలకు రూ.20 వేలు ఇస్తామన్నారు. పంట నష్టం, ఇసుక మేటలేసిన భూముల వివరాలు ప్రభుత్వానికి అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

