తిరుమలాయపాలెం, జనవరి 12 : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆదివారం రాత్రి తృటి లో ప్రమాదం తప్పింది. హనుమకొం డ నుంచి ఖమ్మం వస్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఖమ్మంజి ల్లా తిరుమలాయపాలెం మండలకేం ద్రం సమీపంలో కారు టైరు ఒక్కసారిగా పేలింది. డ్రైవర్ చాకచక్యంగా కా రును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. కారులో నుంచి దిగిన మం త్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాం పు కార్యాలయానికి వెళ్లిపోయారు.