హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డు’ అందజేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ), ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ధాన్యం కొనుగోళ్లు, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను యుద్ధప్రతిపాదిక న పరిషరించాలని ఆదేశించారు. డ బుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు దసరాలోగా అప్పగించాలని ఆదేశించా రు. వరద ప్రభావిత 29 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రూ.ఐదు కోట్ల చొప్పున, ము న్సిపాలిటీలకు రూ.కోటి, కార్పొరేషన్లకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు.