Minister Niranjan Reddy | మిట్ట ప్రాంతంలో ఉన్న పొలాలకు.. మినీ లిఫ్ట్లను ఏర్పాటు చేసి నీళ్లందించాం : మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy | కరువునేల వనపర్తిలో సాగునీటితో సస్యశ్యామలం చేశాను. వానలు కురవకపోయినా ప్రాజెక్టుల ద్వారా పంటలు పండే విధంగా సాగునీళ్లు తీసుకువచ్చానని, మిట్ట ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలకు మినీ లిఫ్ట్ లను ఏర్పాటు చేసి రైతులకు చేదోడుగా నిలిచానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy )అన్నారు.
వనపర్తి : కరువునేల వనపర్తిలో సాగునీటితో సస్యశ్యామలం చేశాను. వానలు కురవకపోయినా ప్రాజెక్టుల ద్వారా పంటలు పండే విధంగా సాగునీళ్లు తీసుకువచ్చానని, మిట్ట ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలకు మినీ లిఫ్ట్ లను ఏర్పాటు చేసి రైతులకు చేదోడుగా నిలిచానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy )అన్నారు. బుధవారం వనపర్తి మండల పరిధిలోని అచ్చుతాపురం, రాజాపేట, ఖాసింనగర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ..సాగునీటి రాకతో నేడు ఎక్కడ చూసినా ధ్యానపు రాశులు కనిపిస్తున్నాయని తెలిపారు. నాలుగు నెలలుగా ఒక్క చుక్క వాన లేదు..15 చెక్ డ్యామ్ లు కట్టించి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చేసినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ ఏం చేయలేదని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు. మరి 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా రైతు బంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో చేసిన పనులు మీ కళ్ల ముందు ఉన్నాయి. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

