సాగుకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
ఎరువులు | గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఇఫ్కో ప్రతినిధులతో

హైదరాబాద్ : గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఇఫ్కో ప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా మూలంగా వ్యవసాయం మీద రైతులకు నమ్మకం పెరిగిందన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి పండుగ అనే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో రెండో స్థానానికి చేరింది. రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారు.
పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయాలన్నారు. తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో సమావేశంలో చర్చించాలన్నారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుతో దక్షిణ భారతదేశం మొత్తానికి అందుబాటులో ప్లాంటు ఉంటుంది అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

