ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతాం: మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఆంధప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని, తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీన్ని సరిదిద్దడానికే జూరాల ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు.
ఏపీ నిర్మిస్తున్నవి అక్రమ ప్రాజెక్టులని, తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులని మంత్రి వెల్లడించారు. ఆనాడు ఏపీ జలదోపిడీకి సహకరించినవాళ్లే.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో జోగులాంబ బరాజ్‌ను ప్రతిపాదించారని వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని, నీటి కేటాయింపులు జరిపించుకోవాలని చెప్పారు.
దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు అందించామని వెల్లడించారు. రైతుబంధు కింద రూ.7360 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 10 ఎకరాలకు పైబడినవారికి రైతుబంధు రూ.600 కోట్లు మాత్రమే ఉన్నారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

