సంగారెడ్డి : దేశ చరిత్రలోనే ప్రధానిగా ఉండి చాలా అంశాల్లో మాట తప్పి, దేశ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి మోదీ మాత్రమే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే దేశ వ్యాప్తంగా రైతుబంధు అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరో మూడు, నాలుగేండ్లలో తెలంగాణ వ్యవసాయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాలం సాగు సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై ప్రసంగించారు. వ్యవసాయం బాగుంటే వంద రకాల ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు భిన్నమైన పంటలను సాగు చేసేందుకు ముందుంటారని తెలిపారు. విభిన్న పంటల సాగుకు తెలంగాణ నేలలు అనుకూలంగా ఉంటాయన్నారు. అన్ని వసతులతో కోహెడలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. వివిధ రకాల ఆహార శుద్ది పరిశ్రమలను తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రైతు వేదికల కేంద్రంగా పంటల ప్రణాళిక అమలు గురించి రైతులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భూసారం తగ్గుతుందని మంత్రి తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ వానాకాలంలో పత్తి సాగు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. ఆముదం పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కావున ఈ పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని నిరంజన్ రెడ్డి కోరారు.
గజ్వేల్ మహాతి ఆడిటోరియంలో నిర్వహించిన మెదక్, సిద్దిపేట జిల్లాల వానాకాలం పంటల సాగు అవగాహనా సదస్సులో మంత్రులు @SingireddyTRS గారు, @trsharish గారు, రైతుబంధు సమితి అధ్యక్షులు @PRRTRS గారు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, pic.twitter.com/RsFqVksvNb
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) May 31, 2022