నల్గొండ : కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్షలాంటిదని, ఆకలిచావుల తెలంగాణను ఎనిమిదేళ్లలో కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మర్రిగూడ మండలం దేవర భీమనపల్లిలో మంత్రి సమక్షంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి అంబాల రమేశ్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు బీ(టీఆర్)ఎస్‌లో చేరారు. మరో 200 మంది గ్రామస్తలు మద్దతు పలికారు. పార్టీ చేరిన నేతలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీని ప్రధానిని చేసి దేశాన్ని అప్పగిస్తే.. ఆకలి సూచీలో దేశాన్ని 107 స్థానంలో నిలిపాడరన్నారు. పాక్, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత స్థానానికి మన దేశాన్ని దిగజార్చడం సిగ్గుచేటన్నారు. మునుగోడు ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది సీఎం కేసీఆరేనని, సాగునీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసింది ఏమీ లేదని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కలిసికట్టుగా అందరం ఏకతాటి మీదకు వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.