యాదాద్రి భువనగిరి: ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు మార్కెట్లో పత్తి క్వింటాల్‌కు రూ.9 నుంచి 10 వేలు పలుకుతున్నదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కర్యాక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పల్లెలో రైతుబంధు విజయోత్సవాలు ఘనంగా సాగుతున్నాయని, వ్యాసరచనలు, చిత్రలేఖనంతో విద్యార్థులు వ్యవసాయరంగం గొప్పదనాన్ని చాటుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతుల మోములో చిరునవ్వులు ప్తూన్నాయని, పార్టీలకతీతంగా ధన్యవాదాలు చెబుతున్నారని వెల్లడించారు.
తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉందని, రైతులు పత్తిసాగుకు మొగ్గుచూపాలన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. రైతులు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ తపన అని చెప్పారు. సాగునీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని వెల్లడించారు. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం అపూర్వమైన విజయమన్నారు. ప్రపంచంలోని 20 పథకాల్లో రైతుబంధు, రైతుబీమా నిలిచాయని తెలిపారు.
యూఎన్ఓ, ఆర్థిక వేత్తలు, వ్యవసాయ నిపుణులు రైతుబంధును ఒక గేమ్ చేంజర్‌గా అభివర్ణించారన్నారు. వ్యవసాయరంగంతో పాటు అన్ని రంగాల్లో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారంచుట్టారని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని తెలిపారు. 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు.