హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని, అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఫలితంగా దేశ అవసరాల కోసం విదేశాల నుంచి పప్పు దినుసులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిని నివారించాలంటే దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’ పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేం ద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంపిణీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 విలుగల శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందించారు.
హాకాకు ప్రభుత్వ సపోర్ట్ భేష్
కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలుత తమ జాబితాలో హాకా లేదని తెలిపారు. హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు వినతి మేర కు అవకాశం ఇచ్చామని, ఇక్కడికి వచ్చి హాకా పనితీరు, తెలంగాణ ప్రభుత్వ మద్దతు చూశా క హాకాపై మరింత నమ్మకం పెరిగిందని చెప్పా రు. సబ్సిడీకి అందే శనగపప్పు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో హాకా చైర్మన్ శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హాకా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్ పాల్గొన్నారు.