కరీంనగర్ : పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగామంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ కరీంనగర్లో మార్క్‌ఫెడ్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ వరకు సాగింది. ఈ సందర్భంగా నగరంలోని మానేరు వంతెన పై నగరపాలక సంస్థకు చెందిన మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభోత్సవంచేసారు.
తదుపరి 24 గంటలు మంచి నీటి సరఫరా, మానేరు రీవర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. ఆ తదుపరి రాంనగర్, పద్మానగర్ ఏరియాలో గల మార్క్ ఫేడ్ గ్రౌండ్ లో నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ వివిద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మొత్తంగా నగరంలో రూ.1025 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ మార్క్‌ఫెడ్‌లో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
అలాగే చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి మున్సిపల్ పరిధిలో రూ.38 కోట్లతో ఏర్పాటుచేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటుగా అక్కడ జరిగే సభలో మాట్లాడుతారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ రానున్న మంత్రి.. కార్పొరేషన్‌తో పాటుగా కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న అబివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు.