హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మెన్ పదవీకాలం మంగళవారం తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావుతో స్నేహాన్ని గుర్తుచేసుకొం టూ ట్వీట్ చేశారు. ‘యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మంత్రి కేటీఆర్‌తో ఉన్న స్నేహాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నా. యునైటెడ్ స్టేట్స్, తెలంగాణకు మధ్య పెరుగుతున్న సంబంధాలకు ఈ అద్భుతమైన భాగస్వామ్యమే ఉదాహరణ’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘తెలంగాణకు మీరు అందించిన అద్భుతమైన మద్దతు, స్నేహానికి ధన్యవాదాలు జోయెల్. మీ కొత్త అసైన్‌మెంట్‌కు నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.