హైదరాబాద్ : తెలంగాణ వస్తే ఏమొస్తది? అని ప్రశ్నించిన వారికి రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధీటైన సమాధానం ఇచ్చారు. నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ నేడు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నది. వాగులు, వంకలు, చెరువులు గోదావరి జలాలతో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. నిన్న విడుదల చేసిన కాళేశ్వరం జలాలతో ముస్తాబాద్ చెరువు నిండిపోయి మత్తడి పోస్తోంది. ఆ ఫోటోలను కేటీఆర్ షేర్ చేస్తూ.. తెలంగాణ అస్తే ఏమొస్తది.? కన్నీరు కారిన చోటే గంగ పరవళ్లు తొక్కింది.. ఆనంద భాష్పాలు కురిపించింది..! అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ అస్తే ఏమొస్తది.?
— KTR (@KTRTRS) April 7, 2021
కన్నీరు కారిన చోటే
గంగ పరవళ్లు తొక్కింది
ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!
Pictures from yesterday; Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer 😊#జైతెలంగాణ✊#JaiTelangana #JaiKCR 🙏 pic.twitter.com/RDUFbRABI2