హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌లో ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్‌ను పొందుపరిచినట్లు కేటీఆర్ తెలిపారు. ఇంటర్ మెటీరియల్‌తో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే తన హామీని నెరవేర్చుకునే సమయం ఆసన్నం కావడంతో సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌ను తానే స్వయంగా పంపిణీ చేస్తానని కేటీఆర్ తెలిపారు.
Happy to be keeping my promise of Gifting Byju’s powered Samsung Tablets to the Govt college students in Rajanna Siricilla district
The tabs are ready & we will start distributing this week 😊#GiftASmile pic.twitter.com/YBDGlod9ea
— KTR (@KTRTRS) September 19, 2022