SMAT : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం అదిరింది. రెండు నెలల విరామం తర్వాత బ్యాట్ పట్టిన పాండ్యా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో రఫ్ఫాడించాడు. జింఖాన స్టేడియంలో మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దంచేసిన పాండ్యాను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఒకరిద్దరైతే పిచ్ మీదకే వచ్చేసి సెల్ఫీలు దిగి నానా హంగామా చేశారు. దాంతో తదుపరి మ్యాచ్‌లో ఫ్యాన్స్‌కు చెక్ పెడుతూ స్మాట్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. డిసెంబర్ 2 మంగళవారం జింఖానా మైదానంలో పంజాబ్, బరోడా తలపడిన మ్యాచ్‌లో.. పాండ్యా బ్యాటింగ్ చేస్తుండగా ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కాళ్లపై పడ్డాడు.
‘ప్లీజ్ ఒక్క సెల్ఫీ’ అని జేబులోంచి ఫోన్ తీసి అతడిని సిబ్బంది ఒకరు లాక్కెళ్లడానికి ప్రయత్నించగా పాండ్యా వారించాడు. ఆ అభిమానితో సెల్ఫీ దిగి పక్కను జరగగానే.. సదరు కుర్రాడినిని సిబ్బంది బయటకు లాక్కెళ్లారు. కాసేపటికే పాండ్యాను చూసేందుకు మరొక కుర్రాడు సైతం క్రీజు వద్దకు వచ్చేయగా సిబ్బంది పరుగున వచ్చి తీసుకెళ్లారు. ఈ రెండు ఘటనలతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దాంతో.. ఆటగాళ్ల భద్రత, అంతరాయాలు లేకుండా మ్యాచ్ జరగాలనే ఉద్దేశంతో నిర్వాహకులు వేదికను మార్చారు. జింఖాన బదులు ఉప్పల్ స్టేడియంలో బరోడా తదుపరి మ్యాచ్ ఆడించేందుకు సిద్ధమయ్యారు.
A fan entered the ground to meet Hardik Pandya during Syed Mushtaq Ali Trophy match at Hyderabad & Hardik asked security to let him take the picture and safely take him out of the ground 🥹. pic.twitter.com/ZmTAhnGiLw
— 93 (@93Yorker) December 2, 2025
A fan breached security during the Punjab vs Baroda match in Hyderabad just to meet Hardik Pandya. Security rushed in, but Hardik calmly stopped them, smiled, and let the fan take a selfie.
Respect for Hardik Pandya — handled it so calmly. 🙌
And his comeback? 🔥
77* off 42… pic.twitter.com/LN22FlP7rI— Reel Boom Daily (@reelboomdaily) December 2, 2025
దేశవాళీ టీ20 మ్యాచ్‌లపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడని తెలిసి ఊహించనివిధంగా ఫ్యాన్స్ జింఖానకు వచ్చేశారు. అందకని.. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని గుజరాత్, బరోడా మ్యాచ్‌ను ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించాం అని సీనియర్ అధికారి తెలిపాడు. పంజాబ్‌పై 42 బంతుల్లోనే 77 రన్స్ కొట్టిన పాండ్యా.. టీమిండియా టీ20 సిరీస్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9న మొదలయ్యే పొట్టి సిరీస్‌లో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడీ స్టార్ ప్లేయర్.
Hardik Pandya reminding everyone who the real beast is 💥 pic.twitter.com/em14RjI4bi
— 11 (@11_crick) December 3, 2025